రణం న్యూస్ డెస్క్ : జులై 4,

ఉపాధి కోసం దుబాయ్ కి వెళ్లిన కోరుట్ల నియోజక వర్గానికి చెందిన ప్రవాస భారతీయులు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మా జీవితాల్లో వెలుగులు నింపుతుందని,అర్హులైన మా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు వచ్చాయని గల్ఫ్ బోర్డ్ ను ఎంపిక చేసి మా కష్టాలు తీర్చుతున్నారని వారు ఆనందం వ్యక్తం చేశారు.సోషల్ మీడియా ద్వారా తాము జరిపిన నర్సింగరావు జన్మదిన వేడుకల వివరాలు పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు తిరుమల గంగాధర్,ఈరవత్తిని దశరథం లకు పంపామని,వీరి చొరవ వల్లే మేము మా నాయకునికి మా కష్టాలు చెప్పుకుని పథకాలకు అర్హులమయ్యామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు శ్రీను,కుమార్,నరేష్ శంకర్ వేంకటేష్ అంజన్న సాగర్ తదితరులు పాల్గొన్నారు
