కోరుట్లలో అధికారిని తీరే వివాదాస్పదం..
బిల్లులివ్వని షాప్ ల పై చర్యలేవి…
జాడలేని అవగాహన కార్యక్రమాలు…
సెటిల్ మెంట్లకు కేంద్రంగా కార్యాలయం…
రణం న్యూస్ కోరుట్ల: మార్చి 19,
కోరుట్ల మండల పరిధిలో పనిచేస్తున్న మండల స్థాయి మహిళ అధికారి తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన పరిధిలోకి వచ్చే షాపుల యజమానులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో లోపాయకార ఒప్పందాలు కుదుర్చుకుంటూ, వృత్తి ధర్మాన్ని పక్కనబెట్టినట్లు ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి.వ్యక్తిగత లాభాల కోసం ఇష్టారీతిన వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయీ.
జాడలేని అవగాహన కార్యక్రమాలు…
ఈ మహిళ అధికారిని వ్యవహారంపై మరో కోణం వెలుగులోకి వస్తోంది. దేశానికి అన్నం పెట్టే వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల అమాయకులు నష్టపోతున్నారని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా నకిలీ మందులు, నాణ్యత లేని ఉత్పత్తులు విక్రయించిన కారణంగా ఆర్థికంగా నష్టపోయిన బాధితులు పై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, వారికి న్యాయం జరగడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
షాప్ ల అసోసియేషన్ చెప్పు చేతల్లోనే అధికారిణి..
ఇక షాపుల అసోసియేషన్తో కుమ్మక్కై వ్యవహరిస్తోందన్న ఆరోపణలు కూడా బలపడుతున్నాయి. సుమారు పట్టణ కేంద్రంతో పాటు మండల కేంద్రంలో 100కు పైగా ఈ సీడ్స్ దుకాణాలు నిర్వహిస్తున్నారు. రైతులకు బిల్లులు ఇవ్వకపోయినా, నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోకపోవడం ద్వారా వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయ నష్టం కలగడమే కాకుండా, దేశానికి వెన్నుముక గా చెప్పబడే వారి హక్కులను కూడా కాలరాస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది షాప్ ల అసోసియేషన్ చెప్పు చేతుల్లోనే ఆ అధికారిని నడుస్తున్నట్లు,కొన్ని సందర్భాల్లో తమ వద్ద అధికారిని తీసుకున్న మామూళ్ల ఆధారాలు ఉన్నా ఈ అసోసియేషన్ నాయకులు బెదిరింపులకు గురిచేసిన సందర్భాలు ఉన్నాయని పలువురు తెలుపుతున్నారు.కొన్ని సందర్భాల్లో అసోసియేషన్ లో అధికారి కూడా భాగస్వామి అన్నట్లు వ్యవరిస్తున్నట్లు తెలియవస్తుంది.
సెటిల్ సెటిల్ మెంట్ కేంద్రంగా కార్యాలయం..
ఫిర్యాదులు అందిన తర్వాత సత్వర చర్యలు తీసుకోవాల్సిన అధికార వ్యవస్థ, విచారణ పేరుతో కార్యాలయాన్నే “సెటిల్మెంట్ కేంద్రం”గా మార్చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాది క్రితం ఓ బాధితుడు ఒక షాప్ యజమాణిపై ఉన్నతాధికారి పిర్యాదు చేయగా బాధితునితో మాట్లాడుకోండి అంటూ సెటిల్ చేసిన దాఖలాలు బహిరంగంగానే మనకు కనిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేయాల్సిన ఈ ప్రభుత్వ కార్యాలయమే, ఇరు వర్గాల మధ్య ఒప్పందాలు కుదుర్చే వేదికగా మారడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో ఫిర్యాదు చేసిన వారిలో నమ్మకం దెబ్బతింటోంది.
ఉన్నతాధికారులు ఏ విదంగా స్పందిస్తారో వేచి చూద్దాం…
ఈ వ్యవహారం పై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతుండగా, సంబంధిత ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి, పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని విశ్లేషకులు కోరుతున్నారు.

